Thursday, June 11, 2020

CHILD CARE LEAVE


CHILD CARE LEAVE






Government have issued orders vide G.O.Ms.No.209, Fin. (HRM.III) Dept., Dt. 21.11.2016, for Child Care Leave for women employees for a period of 3 months, not exceeding 15 days
in any spell in the entire service to look after two eldest children upto the age of 18 years (22 years in case of disabled children) for any of their needs like examinations, sickness etc. subject to the following conditions:

i) It shall be permitted only if the child is dependent on and residing with the Govt. servant.
ii) LTC cannot be availed during this leave
iii) The leave account for child care shall be maintained in the prescribed proforma and it shall be kept along with SB of the employee.
iv) The Head of Office shall ensure that the availment of child care leave to an employee will not affect the functioning of the office.
v) It requires prior sanction of competent authority.
vi) It may be combined of any kind of leave eligible including Maternity Leave, except with CL or SCL.
vii) It is admissible during the period of probation also. The period of probation shall be extended to that extent.
viii) The Leave Salary shall be paid on the pay drawn immediately before proceeding on leave.





శిశు సంరక్షణ సెలవు

  సెలవును వారి పిల్లల పరీక్షలు, అనారోగ్యం మొదలగు సందర్భాలలో వినియోగించుకోవచ్చు.

  సెలవును  LTC  కోసం ఉపయోగిచకూడదు.

  సెలవు ఉద్యోగిని హక్కు కాదు. సౌలభ్యం కొరకు మాత్రమే.

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులకు వారి మొత్తం సర్వీస్ లో 90 రోజులకు మించని శిశు సంరక్షణ సెలవు వినియోగించుకోవచ్చు.

సెలవును 6 విడతలకు తగ్గకుండా, ఒక విడత లో 15 రోజులకు మించకుండా వాడుకోవచ్చును.

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులకు తమ సర్వీస్ లో 60 రోజులకు మించని శిశు సంరక్షణ సెలవు  3 విడతలకు తగ్గకుండా  వినియోగించుకోవచ్చును.

  సెలవు ప్రభుత్వ ఉద్యోగిని మీద ఆధారపడి,వారితో కలిసి జీవిస్తున్న ఇద్దరు పిల్లలకు వారి వయస్సు 18 సం. లు నిండే వరకు వినియోగించుకోవచ్చు.

 ఉద్యోగినికి ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నట్లైతే వారిలో మొదటి ఇద్దరు పిల్లల కోసం సెలవు వర్తిస్తుంది.

 సెలవు మంజూరు అధికారి పూర్వానుమతితో మాత్రమే సెలవు వినియోగించుకోవచ్చు.

 కార్యాలయ అధిపతి / సెలవు మంజూరు అధికారి సెలవు మంజూరు చేయడం ద్వారా కార్యాలయం / పాఠశాల పనులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలి.

 వినియోగించిన శిశు సంరక్షణ సెలవును నిర్ణీత ప్రొఫార్మా లో నమోదు చేసి, సర్వీస్ రిజిష్టర్ నందు భద్రపరచాలి.

సెలవులను ఇతర (అర్థవేతన/ఆర్జిత) సెలవుల ఖాతా తో కలుపకూడదు.

  సెలవు కోసం మొదటి సారి దరఖాస్తు చేసినప్పుడు వారి పిల్లల పుట్టిన తేది ధృవ పత్రం నకలును సమర్పించాలిపిల్లలు దివ్యాంగులైన పక్షంలో సంబంధిత వైద్యాధికారి చే జారీ చేసిన దివ్యాంగుల ధృవ పత్రం నకలు కూడా జత చేయాలి.

 ఉద్యోగిని యొక్క పిల్లలు దివ్యాంగులైన ( 40% కన్నా ఎక్కువ) పక్షములో వారి వయస్సు 22 సం. లు నిండే వరకు ఉపయోగించుకోవచ్చును.

  సెలవు పై వెళ్ళుటకు ముందు రోజు ఉన్న జీత భత్యాలను సెలవు కాలానికి చెల్లిస్తారు.

  సెలవు ను ఆకస్మిక, ప్రత్యేక ఆకస్మిక సెలవులతో కలిపి వాడకూడదు.  LTC  కొరకు తీసుకున్న సెలవులు కలిపి వాడకూడదు.

  సెలవును అర్థ వేతన సెలవు, కమ్యూటెడ్ సెలవు, ప్రసూతి సెలవు లతో కలిపి వాడుకోవచ్చును.

 ప్రొబేషన్ ఉద్యోగినులు కూడా సెలవును ఉపయోగించుకోవచ్చును. కానీ అట్టి సెలవులు వినియోగించుకున్న రోజుల పాటు ప్రొబేషన్ ముందుకు జరుగుతుంది.

  సెలవులకు సఫిక్స్, ప్రిఫిక్స్ వర్తించవు. సెలవు పూర్తయిన మరునాడు తప్పక విధులలో చేరాలి.

No comments:

మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

  మహిళలకు సమాంతర రిజర్వేషన్లు