Thursday, June 11, 2020

PATERNITY LEAVE


PATERNITY LEAVE


The competent authority may grant paternity leave on full pay to married male Govt. employees, temporary or permanent, for a period of
15 days subject to the condition that it shall be granted to those with less than two surviving children with effect from 16.09.2005.
 (G.O.Ms.No.231, Finance (FR.I) Dept., Dt.16.09.2005).

This can be availed either before 15 days or within a period of 6 months from the date of delivery
 (Memo No.20129-C/454/FR.I/2010, Fin.(FR.I) Dept., Dt.21.07.2010)



పితృత్వ సెలవు
Paternity Leave
(  G. O. Ms. No. 231, Fin ( FR -I) Dept.  Dt. 16.09.2005. )
వివాహితులైన శాశ్వత, తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగులందరికీ 15 రోజులకు మించని పితృత్వ సెలవు సౌకర్యం లభిస్తుంది.
ఉద్యోగి భార్య ప్రసూతి అయిన తేది నుండి 6 నెలల లోపు ఈ సెలవు వినియోగించుకోవచ్చు
 ఈ సెలవు సౌకర్యం ఇద్దరు జీవించి ఉన్న పిల్లల వరకే వర్తిస్తుంది
ఈ సెలవు ను ప్రసూతి తేదికి 15 రోజుల ముందు నుండి కూడా వాడుకొనవచ్చును. 
( Govt. Memo No 20129-C / 454 / FR - I / 2010. Fin. (FR-I) Dept. Dt. 21.07.2010. )
ఈ సెలవు ను 15 రోజులు ఒకే మొత్తం గా కాకుండా దఫాలు గా కూడా వాడుకొనవచ్చును. 
( Govt. Memo No 20129-C / 454 / FR - I / 2010. Fin. (FR-I) Dept. Dt. 21.07.2010 )

ఈ సెలవు మంజూరు కోసం ఉద్యోగి తన భార్య ప్రసూతి అయినట్టు  వైద్య ధృవపత్రం సమర్పించాలి
 వైద్య ధృవపత్రం లో స్పష్టంగా పేర్కొనవలసిన వివరాలు.
  • ఉద్యోగి పేరు. 
  • ప్రసూతి అయిన తేది. 
  • ప్రస్తుత కాన్పు తో సహా జీవించి ఉన్న పిల్లల సంఖ్య.
ఈ సెలవును వైద్య ధృవపత్రం ఆధారం గా సంబంధిత వేతన మంజూరు అధికారి (DDO) మంజూరు చేస్తారు.
ఈ సెలవు లు ప్రిఫిక్స్, సఫిక్స్ వర్తించవు. సెలవు కాలం పూర్తయిన మరునాడు తప్పక విధులలో చేరాలి.
ఈ సెలవు ను ఆకస్మిక, ప్రత్యేక ఆకస్మిక సెలవులతో కలిపి వాడుకొనే వీలు లేదు.
ఈ సెలవు ఇతర సెలవు ఖాతా నుండి మినహాయించకూడదు.
సేవా పుస్తకం లో ఈ సెలవు ను నమోదు చేసినప్పుడు అట్టి సెలవు ఎన్నవ సజీవ కాన్పు కై వినియోగించుకున్నారో పేర్కొనాలి.
సెలవు కాలాన్ని డ్యూటీ గా పరిగణించి, వేతనం చెల్లిస్తారు.
సెలవు కాలంలో సెలవు రోజు నకు ముందు రోజు వేతనాన్ని చెల్లిస్తారు.

No comments:

మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

  మహిళలకు సమాంతర రిజర్వేషన్లు