Thursday, June 11, 2020

LEAVE NOT DUE


LEAVE NOT DUE

            When half pay leave is not at his credit, leave not due to an extent of 180 days during entire service can be granted on MC only,
the debit will be in the half pay leave account to be set off against further credit. This can be sanctioned although there is EL at credit. The Leave Not Due granted should be debited in HPL account as minus balance. The minus balance should be adjusted against future earnings.

Not admissible to temporary Govt. servant as he does not earn HPL.

For the grant of leave the service still, remaining upto the due date of retirement should be taken into consideration. For example if an employee is going to retire in 3 years, his request for the grant of Leave Not due should be upto 60 days as his earning capacity of HPL in next 3 years is only 60 days i.e. @ 20 days per year.

If any employee resigns or retires voluntarily after availing this leave and before wiping off the minus balance, the leave salary paid for the minus balance should be recovered. However, if it is on medical invalidation or death, recovery will not be insisted (Rule 15-C and 18-C).


సంపాదించని సెలవు



 AP Leave Rules 1933 మరియు 15C,18C మరియు 25 ను అనుసరించి ప్రోబేషన్ కాలము సంతృప్తికరంగా పూర్తిచేసిన సుపీరియరు మరియు నాల్గవ తరగతి సర్వీసులకు చెందిన ఉద్యోగులందరూ సెలవు పొందుటకు అర్హులు.

సంపాదించని సెలవు మెడికల్ సర్టిఫికెట్ పై మాత్రమే,సగం జీతం సెలవు ఖాతాలో నిల్వలేనపుడు భవిష్యత్ లో ఆర్జించిబోవు సగం జీతపు సెలవును వినియోగించుటకు సెలవు మంజూరు చేయవచ్చును.

[Rule 15(c) & 18(c)]
(G.O.Ms.No.543 F&P Dt:07-12-1977)

 మొత్తం సర్వీసులో 180 రోజులకు మించకుండా సెలవు మంజూరు చేయవచ్చును. విధంగా మంజూరైన సంపాదించని సెలవు సగం జీతం సెలవు ఖాతాలో (-) గా నమోదుచేయాలి.

భవిష్యత్తు లో ఉద్యోగి సంపాదించుకోగలిగిన సగం జీతం సెలవుకు మించి ఇట్టి సెలవును మంజూరు చేయకూడదు.

 ఉద్యోగి భవిష్యత్తు లో సగం జీతం సెలవు సంపాదించుకొగలడని, అంతేకాకుండా మంజూరైన సెలవు తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరుతాడని విశ్వసించినపుడు మాత్రమే సెలవు మంజూరు చేయాలి.

 ఒకవేళ సంపాదించని సెలవులో ఉన్న ఉద్యోగి కారణం చేతనైనా స్వచ్ఛంద పదవీ విరమణ చేయదలచుకున్న అంతకు ముందు మంజూరు చేసిన సెలవు ఉత్తర్వులను రద్దుపరచాలి.అట్టి సందర్భాలలో సెలవు ఎప్పటినుండి ప్రారంభమయ్యిoదో అప్పటి నుండి స్వచ్ఛంద పదవీ విరమణ అమలులోకి వస్తుంది.

అనారోగ్య కారణంగా ఉద్యోగంలో కొనసాగుటకు అశక్తుడై పదవీ విరమణ చేసినా గాని,క్రమశిక్షణా చర్యల ప్రకారం నిర్భంద పదవీ విరమణ చేయబడినా గాని,లేక మరణించినా గాని ఉద్యోగికిచ్చిన సంపాదించని సెలవు జీతాన్ని వసూలు చేయనవసరం లేదు.
(G.O.Ms.No.290 F&P Dt:19-11-1981)

 సంపాదించని సెలవులో ఉన్న ఉద్యోగులకు సగం జీతం సెలవులో పొందే సెలవు జీతం మరియు భత్యo చెల్లిస్తారు.

No comments:

మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

  మహిళలకు సమాంతర రిజర్వేషన్లు